కాలేజీకి లాక్…!

కెరీర్ క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కాలేజీకి లాక్…!
– రెండు నెలలుగా నో స్టడీస్.. క్లాసెస్
– ఆగ్రహించి తాళం వేసిన విద్యార్థులు
– శ్రీ సాయి డిగ్రీలో కళాశాల నిర్వాకం
– ఫ్యూచర్‌తో చెలగాటమొద్దంటూ మొర
తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువులు చెప్పడం లేదని విద్యార్థులు కాలేజీకే తాళం వేశారు. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం శాంత్ మహల్‌ చౌరస్తా సమీపంలో శ్రీ సాయి డిగ్రీ కాలేజీ కొనసాగుతోంది. ఈ కాలేజీకి మల్లేశం కరస్పాండెంట్‌గా కొనసాగుతున్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్‌ ఇయర్‌లో సుమారు 300ల వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. గత యేడాది నవంబర్‌లో పరీక్షలు జరిగాయి.

అప్పటి నుంచి అరకొర క్లాసులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. గత రెండు నెలలుగా ఎలాంటి తరగతులు నిర్వహించడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. యజమాన్యం నిర్వాకం పట్ల విసుగు చెంది సోమవారం కాలేజీకి తాళం వేశారు. తరగతులు నిర్వహించకపోవడంతో అద్యాపకులను, నిర్వహకులను, కరస్పాండెంట్‌ను కోరినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అద్యాపకులకు వేతనాలు అందించకపోవడంతో ఎలాంటి తరగతులు నిర్వహించడం లేదని తెలిపారు.

తాండూరులోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిని స్పందన రాలేదన్నారు. చదువులు చెప్పకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం అడోద్దని వేడుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనకు బీసీ జేఏసీ టౌన్ ప్రెసిడెంట్ సాయి, తదితరులు మద్దతు తెలిపారు.

ఇదికూడా చదవండి…

విద్యుత్‌ శాఖలో 3వేలకు పైగా ఉద్యోగాలు..!