అంతా మంచే జరగాలే..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం

అంతా మంచే జరగాలే..!
– ఎమ్మెల్యే కోసం పూజలు, అన్నదానం
– పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– అభిమానం చాటుకున్న కౌన్సిలర్ మంకాల రాఘవేందర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి అంతా మంచే జరగాలని మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ అభిమానాన్ని చాటుకున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురై క్షేమంగా బయటపడంతో పాటు వచ్చేనెల 3 నుంచి చేపడుతున్న అతిరుద్ర మహాచండి యాగం జయప్రదం కావాలని సోమవారం 26వ వార్డు కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని మర్రిచెట్టు కూడలి వద్ద వెలసిన శ్రీ రక్తమైసమ్మ దేవాలయంలో పూజలు, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్వయంగా హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొని ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెలే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రజల ఆదరాభిమానాలు ఎన్నటికీ మరువలేనివన్నారు. తన క్షేమం కోసం పూజలు చేయడం సంతోషకరమన్నారు. కౌన్సిలర్ రాఘవేందర్ మాట్లాడుతున్న తాండూరు ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(వయూం), కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage