రెండు గ్రూపుల ఘర్షణ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రెండు గ్రూపుల ఘర్షణ..!
– విడిపించేందుకు వెళ్లిన పోలీసులతో దురుసు ప్రవర్తన
– 15 మందిపై కేసు, ఇద్దరికి 14 రోజుల రిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాత కక్షలతో రెండు గ్రూపులు ఘర్షణ పడిన ఘటనలో 15 మందిపై కేసు నమోదు కాగా అందులో విడిపించేందుకు వెళ్లిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు నిందితులను రిమాండుకు తరలించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్లో గురువారం మధ్యాహ్నం విన్ను, బి.శ్రీకాంత్, బి.టిల్లు అలియాస్ శ్రీధర్, శ్రీకాంత్, మల్లు, మణి, వంశీ, మధుతో మరికొంత మంది మరో వర్గానికి చెందిన శివప్రసాద్, కిరణ్, శివప్రసాద్ (కందనెల్లి), నిఖిల్, ప్రమోద్, సోమేష్ లతో పాటు మరికొందరితో పాత కక్షలు మనసులో ఉంచుకుని ఘర్షణ పడ్డారు.

ఈ సంఘటనపై డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో విధుల్లో ఉన్న బ్లూకోట్ కానిస్టేబుళ్లు సత్తార్, సాయిరాంలు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాతుల శ్రీకాంత్, బాతుల టిల్లు అలియాస్ శ్రీధర్ లు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారు. ఈ మేరకు ఘర్షణ పడిన 15 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన శ్రీకాంత్, శ్రీధర్ లను కోర్టులో హాజరు పరచగా ఈ ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతలకు, పోలీసు విధులకు విఘాతం కలిగిస్తే చట్ట రిత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

కొత్త కమిటిలతో బీసీల ఉద్యమం బలోపేతం..!