రేపు తాండూరుకు సబితమ్మ రాక

తాండూరు వికారాబాద్

రేపు తాండూరుకు సబితమ్మ రాక
– పంచాయతీలకు ఫాగింగ్ మిషన్ల పంపిణీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రేపు తాండూరుకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విచ్చేస్తున్నారు. ఈ విషయంపై గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది. శుక్రవారం ఉదయం తాండూరులోని బాలాజీ మందిర్లో మార్వాడి యువమంచ్ వారు ఏర్పాటు చేసిన వికలాంగుల శిబిరానికి మంత్రి సబితా రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా తులసీ గార్డెన్‌లో మండలంలోని గ్రామ పంచాయతీలకు డీఎంఎఫ్టీ నిధులతో అందజేస్తున్న దోమల నియంత్రణ మిషన్(ఫాగింగ్)లను పంపిణీ చేస్తారని తెలిపారు. దీంతో పాటు కోట్‌ప‌ల్లి మండలంలో మార్కెట్ కమిటి పాలకవర్ల పదవి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. మరోవైపు కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు పట్టణంలోని కాళికాదేవి, పోటీ మహారాజ్ దేవాలయాల పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. కావున ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.