నా పెళ్లి.. నేనే చేసుకుంటా..!
– తానే పురోహితుడైన పెళ్లి కుమారుడు
– సోషల్ మీడియాలో వైరల్
దర్శిని డెస్క్ : పెళ్లంటే తప్పట్లు.. తాళాలు.. తలంబ్రాలతో పాటు తంతు జరిపే పురోహితుడు ముఖ్యమే. పురోహితుడు లేకుండా ఏ పెళ్లి జరగదు. పురోహితుడు అయినా కూడా మరో పురోహితునికి మంత్రోచ్చరణలతోనే పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ పెళ్లి కొడుకు తానే పురోహితుడై తన పెళ్లిని జరుపుకున్నాడు. వివరాల్లోకి వెళితే… ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికుమారుడే పురోహితుడిగా మారారు. సహారన్‌పుర్ జిల్లాకు చెందిన వివేక్‌కుమార్‌కు హరిద్వార్ జిల్లావాసి అనిల్‌కుమార్ కుమార్తెతో పెళ్లి నిశ్చయమైంది. వివేక్‌కుమార్ ఊరేగింపుతో పెళ్లిమండపానికి వచ్చారు. ఇదే వేదికపై ఓ పూజారి కూడా ఉన్నారు.
ఆ సమయంలో వరుడు తన వివాహ ఆచారాలను తానే నిర్వహిస్తానని పూజారికి చెప్పారు. వరుడు మంత్రాలు జపించడం ప్రారంభించగానే ఆహూతులంతా కరతాళధ్వనులు చేశారు. స్వయంగా వేదమంత్రాలు చదువుతూ తన వివాహ తంతును పూర్తి చేశారు. ఆ తర్వాత హోమం.. మూడు ప్రదక్షిణలు చేయాల్సి ఉంది. ఈ వివాహం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదికూడా చదవండి…

