ప్రవేటు టీచర్‌కు లయన్స్ క్లబ్, ఐవీఎఫ్ చేయూత

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రవేటు టీచర్‌కు లయన్స్ క్లబ్, ఐవీఎఫ్ చేయూత
– మూడు నెలల నిత్యవసర సరుకులు అందజేత
– భరోసా అందించిన అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పక్షవాతానికి గురై పేదరికంతో ఇబ్బందులు పడుతున్న ప్రవేటు టీచర్ కు తాండూరు లయన్స్ క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) తరుపున నేతలు చేయూత అందించారు. తాండూరు పట్టణం రాజీవ్ కాలనీకి చెందిన ఓ ప్రవేటు టీచర్ ఇటీవల పక్షవాతం సోకి అనారోగ్యం పాలయ్యారు. దీంతో కుటుంబం పోషణ భారమైంది. భార్య పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ ఆదివారం ప్రవేటు టీచర్ కుటుంబాన్ని పరామర్శించారు. తన తండ్రి స్మారకార్థం కుటుంబానికి 3నెలలకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేసి భరోసా అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకన్న గౌడ్, నాయకులు జిలాని, లయన్స్ సభ్యులు శరణు, అసద్, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

హమాలీ కార్మికులకు తగిన గుర్తింపు