ప్రతిష్ట పెంచేలా పనిచేయండి..!
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యే సోదరులను కలిసిన భద్రేశ్వర దేవాలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : భద్రేశ్వర దేవాలయ ప్రతిష్టను పెంచడంతో పాటు దేవాలయ అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయ నూతన కమిటి సభ్యులకు సూచించారు. శుక్రవారం తాండూరు బావిగి భద్రేశ్వర దేవాలయ పునరుద్ధరణ కమిటి నూతన సభ్యులు పటేల్ కిరణ్ కుమార్(చైర్మన్), తదితరులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
అదేవిధంగా ఎమ్మెల్యే సోదరుడు, కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ కమిటిలో ఎన్నికైన సభ్యులు బాధ్యతగా మెలగాలన్నారు. దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. దేవాలయ ప్రతిష్ఠతను పెంచడంతో పాటు అభివృద్ధికి కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జాక సంగమేశ్వర్, జొల్లు రోహిణి, శెట్టి సురేష్, గాండ్ల వీరణ్ణ, కల్లూరు బస్వరాజ్, కోటం సిద్ధలింగం, ఎం. ప్రశాంత్ కుమార్, గడ్డి కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

