తాండూరు సబ్ రిజిస్ట్రార్ పుర్యా నాయక్ బదిలీ

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు సబ్ రిజిస్ట్రార్ పుర్యా నాయక్ బదిలీ
– ఉత్తర్వులు జారీతో రిలీవ్
– వివాదాస్పదంగా పనితీరుతో చర్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ రిజిస్ట్రార్ పుర్యా నాయక్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాండూరు సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన పనితీరు వివాదాస్పదంగా జరిగింది ఆయన తీరు పట్ల డాక్యూమెంట్ రైటర్లు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. పుర్యా నాయక్ ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ తీరుపట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డిలకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సబ్ రిజిస్ట్రార్ పుర్యా నాయక్ ను బదిలీ చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు తాండూరు సబ్ రిజిస్ట్రార్ పుర్యా నాయక్ ను బదిలీ చేశారు. ఉత్తర్వులు జారీ కావడంతో పుర్యా నాయక్ మంగళవారం మధ్యాహ్నం రిలీవ్ అయ్యాయి ఇక్కడి నుంచి ఆయనను బదిలీ చేసినా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ఐజీ హెడ్ ఆఫీసులో బాధ్యక్షులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఇదికూడా చదవండి…

అభిషేక్ స్పూర్తి భేష్..!