సిబిల్‌ స్కోర్‌ లేదని మ్యారేజీ క్యాన్సల్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

సిబిల్‌ స్కోర్‌ లేదని మ్యారేజీ క్యాన్సల్..!
– వరుడికి షాకిచ్చిన అమ్మాయి ఫ్యామిలీ
– సోషల్ మీడియాలో వైరల్‌ అయిన ఘటన
దర్శిని ఢెస్క్ : క్రెడిట్ కార్డు వాడటం చాలా మంది స్టేటస్‎గా భావిస్తుంటారు. సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తూ తమ క్రెడిట్ స్కోర్ ను మెరుగ్గా ఉండే విధంగా చూసుకుంటారు. ఈ సిబిల్‌ స్కోర్ సరిగ్గా లేకపోవడంతో ఓ వరుడికి కావాల్సిన పెళ్లి రద్దయ్యింది. ఓ పెళ్లి చేస్తున్నామంటే.. వరుడు ఎలాంటి వాడు, మంచి గుణాలు, చెడు వ్యసనాలు, ఆస్తిపాస్తులు చూస్తుంటారు. ఇందులో ఏమాత్రం అనుమానాలు ఉన్నా పెళ్లిని రద్దుచేసుకుంటారు. అయితే ప్రస్తుతం కాలం మారింది గురూ అనేలా ఓ సంఘటన చర్చనీయాంశమైంది. వరుడికి సిబిల్‌ స్కోర్‌ (CIBIL core) సరిగ్గా లేదని వివాహాన్ని రద్దు చేసుకున్నారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న సంఘటన స్థానిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యవకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. వివాహానికి కావాల్సిన అన్ని విషయాలు మాట్లాడుకొని తేదీ సైతం ఖరారు చేశారు. అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్‌ స్కోర్‌ను చెక్‌ చేయగా అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సిబిల్‌ స్కోర్‌ కూడా తక్కువ ఉండడంతో వారు ఈ పెళ్లికి నిరాకరించారు.

ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న యువకుడు తమ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడని ప్రశ్నించారు. అందుకే ఈ వివాహం రద్దు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వధువు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదికూడా చదవండి…

తాగేసీ.. ఠాణా వద్ద వీరంగం..!