తాగేసీ.. ఠాణా వద్ద వీరంగం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాగేసీ.. ఠాణా వద్ద వీరంగం..!
– నూసెన్స్‌ చేసిన మందుబాబుపై కేసు
– నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష, జరిమాన
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పూటుగా మద్యం తాగిన ఓ మందుబాబు పోలీసు ఠాణా వద్దకు వెళ్లి వీరంగం సృష్టించాడు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా నానా హంగామా చేశాడు. చివరకు పోలీసుల విధులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించడంతో అతనిపై కేసు నమోదు చేశారు. న్యాయస్థానంలో హాజరు పరచగా జైలు శిక్షతో పాటు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు వెల్లడించారు. పెద్దేముల్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ గ్రామానికి చెందిన బోడ వెంకటప్ప గురువారం రాత్రి మద్యం త్రాగి పెద్దేముల్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.

మద్యం మత్తులో స్టేషన్ ఆవరణలో న్యూసెన్స్‌కు పాల్పడ్డాడు. అక్కడ ఉన్న పోలిస్ సిబ్బంది అతనికి ఎంత నచ్చజెప్పినా వినకుండా నానా హంగామా చేశాడు. దీంతో పోలీసులు వెంకటప్పపై కేసు నమోదు చేశారు. శుక్రవారం తాండూరులోని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష, రూ. 1000ల జరిమానా విధించడం జరిగిందని ఎస్ఐ శ్రీధఱ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎవరైనా మద్యం తాగి పోలీస్ స్టేషన్‌ వద్ద, ప్రభుత్వ స్థలాల వద్ద వీరంగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్…!