తెలంగాణ ఉద్యమ కారుల హడాక్ కమిటి ఏర్పాటు
– తాండూరు ఐక్యవేదిక ఆధ్వర్యంలో సభ్యుల ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ తెలంగాణ ఉద్యమ కారుల హడాక్ కమిటి ఆదివారం ఏర్పాటయ్యింది. పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న ప్రగతి స్కూల్ లో తాండూరు నియోజకవర్గ ఉద్యమ కారుల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యమ కారుల హడాక్ కమిటిని ఎన్నుకున్నారు. కమిటిలో ఫిరోజ్ ఖాన్, బంటారం భద్రేశ్వర్, కేశవులు, సయ్యద్ మోయిజ్, సంజయ్ గౌడ్, చెన్నారం శేఖర్, ప్రకాష్ గౌడ్, అడ్వయిజరీ కమటి సభ్యులుగా కమల్ అతహర్, గోవిందరావు, శ్రీనివాస్ రెడ్డి, సయ్యద్ ముజీబ్, ఆర్. శరణు బసప్ప, కోఆర్డినేటర్లుగా పర్యాద రామకృష్ణ, జిలాని, వాజిద్ లను తాత్కాళికంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో సమావేశం నిర్వహించి ఉద్యమకారులకు న్యాయం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.
ఇదికూడా చదవండి…

