ఢిల్లీ దాకా ఉద్యమిద్దాం..!
– రాజకీయాల్లో సమాన వాట కోసం పోరాటం తప్పదు
– బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసే శక్తి మహిళలదే
– ఎన్నికల్లో ప్రతి బీసీ మహిళ పోటీకి సిద్ధం కావాలి
– బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– తాండూరులో బీసీ మహిళ కార్యవర్గ సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయాల్లో బీసీలకు సమానవాటా దక్కాలంటే తాండూరు నుంచి ఢిల్లీ దాకా అయినా ఉద్యమించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం తాండూరు పట్టణంలోని విషాల్ మార్ట్ వద్ద బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో నియోజకవర్గ మహిళ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ షుకూర్, పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ, బీసీ సంఘం జిల్లా మహిళ అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ 77 ఏండ్ల భారత స్వాతంత్రంలో బీసీలకు సమాన వాట దక్క లేకపోవడం శోచణీయమన్నారు. అగ్రకులాలే క్రీయశీలకంగా ఎదిగి బీసీలను బిచ్చగాళ్లలాగానే చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో బీసీలకు సమాన వాటా దక్కాలంటే పార్టీలు, కుల, మతాలు పక్కన పెట్టి ఉద్యమించాలన్నారు. బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేసే శక్తి మహిళల్లో ఉందని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ వచ్చే ప్రతిచోట మహిళలు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ఇందుకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య మద్దతు ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు బీసీ కులాల మద్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తాయని. ఆ ఉచ్చులో ఏమాత్రం పడరాదన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, నియోజకవర్గ అధ్యక్షురాలు అనిత లు మాట్లాడుతూ బీసీలు అందరు సంఘటితం కావాలన్నారు. రాజ్యాధికారం పొందేందుకు ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాజకీయ సాధికారత కోసం మహిళలు పోరాటం చేసి చరిత్రగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు మంజుల, విజయలక్ష్మి, కార్యదర్శి జగదీశ్వరి, నాయికోటి జ్యోతి, బషీరాబాద్ మండల అధ్యక్షురాలు వీరమణి, పెద్దేముల్ మండల అధ్యక్షురాలు శివలీల, మండలాల అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, లక్ష్మణచారి, శ్రావణ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, బీసీ విద్యార్థి నాయకుడు యాసర్, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజు, యువనాయకులు రాము ముదిరాజ్, శివ, గిరిజాపురం రమేష్, పరమేష్, నాయి వివేక్, వివిధ మండలాల, పట్టణ మహిళలు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
మరోవైపు సమావేశంలో తాండూరు డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మహిళ సంఘం ఉపాధ్యక్షురాలుగా మంజుల విజయలక్ష్మీ, కార్యదర్శిగా జగదీశ్వరిలను ఎన్నుకున్నారు. అనంతరం మహిళ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, సయ్యద్ షుకూర్, మధులత శ్రీనివాస్ చారి, అనితలను ఘనంగా సన్మానించారు.
ఇదికూడా చదవండి…

