ఉద్య‌మ కారుల‌ను మ‌ర‌వ‌కండి

తాండూరు వికారాబాద్

ఉద్య‌మ కారుల‌ను మ‌ర‌వ‌కండి
– ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌లో ప్రాధాన్యం క‌ల్పించండి
– ఎమ్మెల్సీకి విన‌తిప‌త్రం అంద‌జేసిన ఉద్య‌మ‌కారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో పోరాడిన ఉద్య‌మ కారుల‌ను మ‌ర‌కుండా ప్ర‌భుత్వ ప‌థ‌కాలలో ప్రాధాన్య‌మివ్వాలని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిని తాండూరు తెలంగాణ ఉద్య‌మ కారులు కోరారు. గురువారం తాండూరు ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్సీ నివాసంలో మ‌హేంద‌ర్ రెడ్డిని క‌లిసి విన‌తిప‌త్రం
అంద‌జేశారు. తాండూరులోని టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులకు డబల్ బెడ్ రూమ్, ప్రభుత్వ పథకాలులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాల‌ని విజ్ఞాప‌న‌ప‌త్రంలో కోరారు. తెలంగాణ ఉద్యమంలో త‌మ‌వంతు ఉద్య‌మం చేప‌ట్టామ‌ని, ఆ స‌మ‌యంలో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డామ‌ని గుర్తుచేశారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వ ప‌థ‌కాలతో, డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరులో ప్రాధాన్య‌మిచ్చి ఉద్య‌మ‌కారులకు న్యాయం చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ మాజీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అబ్దుల్ ర‌వూఫ్‌, ఉద్య‌మ‌కారులు ప్ర‌కాష్ గౌడ్, జిలాని, భాను, ద‌త్తాత్రేయ‌, వాజిత్ త‌దిత‌రులు ఉన్నారు.