సీతారంపేట్ హనుమాన్ దేవాలయంకు గ్రీన్ సిగ్నల్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సీతారంపేట్ హనుమాన్ దేవాలయంకు గ్రీన్ సిగ్నల్..!
– పాలకవర్గం ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ
– ప్రకటించిన దేవాలయ ఈఓ తాడెం నరేందర్
– దరఖాస్తులకు గడువు ఎప్పటి వరకు అంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ పాలకవర్గ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ అయినట్లు ఈఓ తాడెం నరందర్ తెలిపారు. సోమవారం దేవాదాయ శాఖ హైదరాబాద్ ఉప కమీషనర్ ట్రస్టు ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైన 20 రోజులలోపు పాలకవర్గం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులను రంగారెడ్డి జిల్లా సహాయ కమీషనర్ దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యాలయంలో సమర్పించాలని స్పష్టం చేశారు.

ఇదికూడా చదవండి…

శివ భక్తుల సేవకు కదిలిన శంకరన్న…!