మరికాసేపట్లో తాండూరుకు కేటీఆర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మరికాసేపట్లో తాండూరుకు కేటీఆర్..!
– హెలీప్యాడ్‌ల్‌లో లాండ్‌ అవుతున్న రామన్న
– రోడ్‌ షో సక్సెస్‌ హడావుడిలో పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరులో మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నేపథ్యంలో తాండూరులో కేటీఆర్ రోడ్ షో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు కేటీఆర్ తాండూరుకు రాబోతున్నారు. ప్రత్యేక హెలీప్యాడ్‌లో కేటీఆర్ తాండూరులో లాండ్ కాబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సరిగ్గా మరో గంటలోపే కేటీఆర్ తాండూరులో అడుగు పెట్టబోతున్నారు. మరోవైపు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో కేటీఆర్ రోడ్‌ షో జరగబోతోంది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రోడ్‌ షోను సూపర్ సక్సెస్ చేయాలని ఫోకస్ పెట్టారు. ఇందిరా చౌరస్తాలో పక్కా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రోడ్‌ షోలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా దృష్టిసారిస్తూ హడావుడి చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

రామన్న రాకకు పక్కా ఏర్పాట్లు..!