నిస్వార్థంగా సేవ చేస్తా..!
– వార్డు సభ్యులంతా నా కుటుంబం
– బోరు మోటార్ ప్రారంభించిన ఎజాజ్
– గత కౌన్సిలర్ పనితీరుపై విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేస్తానని తాండూరు పట్టణం 25వ వార్డు బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు మహహ్మద్ ఎజాజ్ అన్నారు. ఈనెల 18న ఎజాజ్ సొంత ఖర్చులతో వార్డులో బోరు మోటారు వేయించారు. ఆదివారం ఎజాజ్ వార్డు ప్రజలతో కలిసి బోరు మోటారును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎజాజ్ మాట్లాడుతూ కాలనీలో ఏండ్లుగా నీటి సమస్య ఉండడంతో ప్రజల కష్టాలను గుర్తించి ఎజాజ్ బోరు మోటారు వేయించడం జరిగిందన్నారు. వార్డు ప్రజలను తన సొంత కుటుంబ సభ్యుల్లా భావించి నిస్వార్థంగా సేవ చేయడమే తన ఉద్దేశమన్నారు. గతంలో ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఓ సంస్థ సహాకారంతో 9 బోర్లు వేయించడం జరిగిందని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో కూడా ప్రజల కోసం తనవంతు బాధ్యతగా చేయూతను అందిస్తానని అన్నారు. అదేవిధంగా గతంలో పనిచేసిన కౌన్సిలర్ ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదని అన్నారు. గతంలో వేసిన బోరుకు మరమ్మత్తులు చేయించి బోరు మోటారు వేయించినట్లు చెప్పుకున్నారని విమర్శించారు. 5 ఏండ్లలో కొత్తగా ఒక బోరు వేయించినట్లు చూపించాలని, చూపిస్తే వార్డులో కనిపించనని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

