నగరేశ్వర, పోట్లీ మహారాజ్ గుళ్లకు నోటిఫికేషన్

తాండూరు రాజకీయం వికారాబాద్


నగరేశ్వర, పోట్లీ మహారాజ్ గుళ్లకు నోటిఫికేషన్
– దరఖాస్తులకు ఆహ్వానించిన దేవాదాయ శాఖ
– ప్రకటించిన ఈఓ తాడెం నరేందర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయం, సద్గురు పోట్లీ మహారాజ్ దేవాలయాలలో పాలక మండళ్ల ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయా దేవాలయాల ఈఓ తాడెం నరేందర్ తెలిపారు. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం రెండు దేవాలయాల్లో ట్రస్టు బోర్డు సభ్యుల నియామకం కోసం హైదరాబాద్ దేవాదాయ శాక కమీషనర్ ఈ నోటిఫికేషన్ జారి చేయడం జరిగిందని చెప్పారు. నోటిఫికేషన్ విడుదలైన 20 రోజుల్లోపు అసక్తిగలవారు దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

ఇదికూడా చదవండి…

భరత్ భూషణ్ కు నివాళులు..!