ఫేక్ డాక్టర్ల ఆగడాలకు కళ్లెం..!
– నకిలీ ఆర్ఎంపీ వైద్యులపై దృష్టి
– హద్దులు దాటి వైద్యం చేస్తే కేసులు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: జిల్లాలో ఫేక్ డాక్టర్ల ఆగడాలకు కళ్లెం వేసే చర్యలు చేపట్టడం జరిగిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ అన్నారు. నకిలీ వైద్యం అందించే ఆర్ఎంఫీ వైద్యులపై దృష్టిసారించడం జరిగిందని ఆదివారం ఓ ప్రటకలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ కేవలం ప్రథమ చికిత్స చేసి రోగులను, క్షతగాత్రులను డాక్టర్ ల దగ్గరకు రెఫర్ చేయాల్సిన ఆర్‌ఎంపి వైద్యులు వారే నేరుగా వైద్యం అందించే సంఘటనలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఆర్‌ఎంపి వైద్యులు నిరుపేదలు, గ్రామీణ ప్రజలు, నిరక్ష్యరాసులే లక్ష్యం గా చేసుకొని వారికి వైద్యం అందించడం జరుగుతోందని తెలుస్తుందన్నారు. ఆర్‌ఎంపి వైద్యులు తమ పరిధిలోని వైద్యం మాత్రమే చేయాలని, హద్దులు దాటి వైద్యం చేసినట్లు అయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హెచ్చరించారు.
ఇకపై ఫేక్ డాక్టర్‌ల ఆగడాలు సాగనివ్వమన్నారు. అదే విధంగా ప్రజలు నకిలీ వైద్యం అందించే వారి పట్ల మరియి ఆర్‌ఎంపి వైద్యుల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. తమకు చికిత్స చేయడానికి ఆ వైద్యులు అర్హులా? కాదా? అనే విషయం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఏమి తెల్సుకోకుండా నకిలీ వైద్యం ద్వారా చికిత్స చేసుకోవద్దన్నారు. నకిలీ వైద్యం వలన జరిగే కార్యకలపల వలన లా & ఆర్డర్ సమస్యలు రావడం జరుగుతుందని అన్నారు. కావున నకిలీ వైద్యం అందించే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ ప్రాంతాలలో ఎవరైనా నకిలీ వైద్యులు గాని తమ పరిధి ని మించి వైద్యం అందించే ఆర్‌ఎంపి వైద్యులు ఉన్నచో పోలీస్ అధికారులకు గాని లేదా డయల్ 100 కు గాని సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

