బీసీ సంఘం తాండూరు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా యాలటి శ్రీనివాస్ సగర

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీ సంఘం తాండూరు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా యాలటి శ్రీనివాస్ సగర
– ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా నియామకపత్రం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘం తాండూరు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ యాలటి శ్రీనివాస్ సగర నియామకం అయ్యారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. శుక్రవారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో తాండూరు బీసీ నాయకులు ఆర్.కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బీసీ సంఘం తాండూరు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా మాజీ ఎంపీటీసీ యాలటి శ్రీనివాస్ సగరను నియమించి.. నియామకపత్రం అందజేశారు. అనంతరం శ్రీనివాస్ సగర మాట్లాడుతూ ఆర్.కృష్ణయ్య, రాజ్ కుమార్, షుకూర్ తదితర సంఘం నాయకుల నాయకత్వంలో డివిజన్‌లో బీసీ సంఘం అభివృద్ధితో పాటు బీసీల అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనను డివిజన్ కార్యదర్శిగా నియమించడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త కోహీర్ రాజు, రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్, బీసీ మహిళ అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి, తాండూరు డివిజన్ మహిళా అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు మంజుల, నరసమ్మ, కార్యదర్శి జగదీశ్వరి, యాలల మండల అధ్యక్షులు లక్ష్మణ చారి, యువ నాయకులు అరుణ్ రాజ్, విజయ్ కుమార్, ఫయాజ్, రాములు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

బీసీ జాతీయ స్థాయి ఉద్యమానికి సిద్ధంకండి