బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
– నివాళులు అర్పించిన గౌడ సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బహుజన వర్గాల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తాండూరు గౌడ సంఘం నాయకులు అన్నారు. సోమవారం సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని వినాయక్ చౌరస్తా వద్ద జయంతి వేడుకలు జరుపుకున్నారు.

తాండూరుకు చెందిన గౌడ సంఘం పెద్దలు మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, గ్రంధాలయ సంస్థ మాజీ | చైర్మన్ రాజుగౌడ్, పోటీ మహారాజ్ దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్ తదితరులు విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ తొలి బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అభివర్ణించారు. కులవృత్తులను ఏకం చేసిన మహోన్నతుడని అన్నారు.

శివాజీ మహరాజ్ లాగా మొగులాయిలను, పెత్తం దారులను ఎదురించి బహుజనుల హక్కుల కోసం ఉద్యమించిన సర్వాయి పాపన్న గౌడ్ ఆదర్శనీయుడని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ మాజీ చైర్మన్ రాజన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు వెంకట్రాములు గౌడ్, సుదర్శన్ గౌడ్, హరిహరగౌడ్, దేవాలయ కమిటి సభ్యులు నవీన్ గౌడ్, శ్రావణ్ గౌడ్, ఉపాధ్యాయులు నారాయణ గౌడ్, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

