సై.. సై.. సైకిలింగ్..!
– ఉత్సహాంగా సైక్లోథాన్ యాత్ర
– పురవీధుల్లో ఆకట్టుకున్న సైకిల్ ర్యాలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఆల్ ఇండియా మార్వాడి యువమంచ్ పిలుపు మేరకు ఆదివారం తాండూరు మార్వాడి యువమంచ్, కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లోథాన్ యాత్ర కొత్త ఉత్సహాన్ని నింపింది. పట్టణంలోని పురవీధుల్లో నిర్వహించిన సైకిలింగ్ యాత్రలో విద్యార్థులు, మంచ్ సభ్యులు ఉత్సహాంగా పాల్గొన్నారు. పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ నుంచి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, హైదారాబాద్ సైకిలిస్ట్ గ్రూప్ అధ్యక్షులు రవీందర్ నందనూరిలు హాజరై ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రారంభైమన ర్యాలీలో 150 మంది విద్యార్థులు, సైకిలిస్టు సభ్యులు, మార్వాడి యువమంచ్ సభ్యులు పాల్గొన్నారు.

పట్టణంలోని ఇందిరా చౌరస్తా, శివాజీ చౌక్, వీవీహెచ్ఎస్ స్కూల్, ఎస్బీఐ బ్యాంకు, గాంధీ చౌక్, భద్రేశ్వర చౌక్, మార్వాడి బజార్, డీఎస్పీ కార్యాయలం, శాంత్ మహాల్ చౌరస్తా మీదుగా తిరిగి కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ వద్దకు చేరుకుంది. పురవీధుల్లో కొనసాగిన ర్యాలీలో సైకిలింగ్‌పై అవగాహన కల్పించారు.

అదేవిధంగా డీఎస్పీ శేఖర్ గౌడ్, సైకిలిస్ట్ గ్రూప్ అధ్యక్షులు రవీందర్ నందనూరిలు మాట్లాడుతూ సైకిలింగ్ చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయన్నారు. ప్రతిరోజూ సైకిలింగ్ చేస్తే ఆరోగ్యం ఫిట్‌గా ఉంటుందన్నారు. అందరు సైకిలింగ్‌పై అవగాహన పెంచుకుని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సైకిలిస్ట్ గ్రూపు సభ్యులు ప్రవీణ్ గడీల, నరేందర్, రాధేశ్యాం తివారి, భీంసిగ్ కిరణ్, మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, జాతీయ కన్వీనర్ కుంజ్ బిహారి సోని, రాష్ట్ర ఉపాధ్యక్షులు రోహిత్ అగ్రవాల్, రాష్ట్ర క్రీడల కన్వినర్ పవన్ పండిత్, తాండూరు అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, సభ్యులు సన్ని అగ్రవాల్, అనిల్ సార్డా, మన్మోహన్ బూబ్, ఆశిష్ సార్డా, కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


