జగత్తు సృష్టికర్తలు మహిళలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జగత్తు సృష్టికర్తలు మహిళలు..!
– దేశ అభివృద్ధి, ప్రగతిలో కీలక పాత్ర
– మహిళల అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం
– మహిళ సంఘాలకు ఆర్టీసీ బస్సులతో చేయూత
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– మహిళ ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : జగత్తులోనే గొప్ప సృష్టి మహిళలే అని, వారు అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగేలా అందరు ‘ రాణించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు.

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురుస్కరించుకుని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు మండలం, యాలాల మండలం, పెద్దేముల్ మండలం, బషీరాబాద్ మండలాల్లోని మహిళ ప్రజా ప్రతినిధులు, నేతలు, మహిళ టీచర్లు, పోలీసులు, మెడికల్, ఆర్టీసీ, అటవిశాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర ప్రభుత్వ శాఖల మహిళ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సోమవారం తాండూరు పట్టణం ఎస్వీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై మహిళలను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగత్తులో మహిళలు గొప్ప సృష్టి అని, అన్ని రంగాల్లో వారు సత్తా చాటుతున్నారని అన్నారు. విద్యా, వైద్యం, రాజకీయం తదితర రంగాలలో సాధికారతను సాధిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు వంటింటికి పరిమిత మైన మహిళలు దేశ ప్రగతిలో ముందుంటున్నారని అన్నారు. మహిళలకు అవకాశం కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అనే నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నిరంగాలలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. ఇప్పటికే అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించారని అన్నారు.

త్వరలోనే ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళ సంఘాలకు తొలివిడతగా 150 ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని అన్నారు. అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్, మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, పలువురు మహిళ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు. శాఖల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఇసుక పర్మిట్ల గోల్‌మాల్..!