ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి తోడ్పాటు
– రూ. 17,500లను అందజేసిన మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీపూర్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ తోడ్పాటు అందించారు. మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తన వంతు సాయంగా రూపాయలు 17500 నగదును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాలు సంసృతి సంప్రదాయాలకు నిలయాలన్నారు. దేవాలయాలను అభివృద్ధి చేసుకోవడంలో అందరు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పెద్దేముల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, బషీరాబాద్ మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, పూజారి అంజిలప్ప పంతులు తదితరులు ఉన్నారు.

