పేద విద్యార్థుల భవితకు తోడ్పాటు..!
– విద్యార్థులు కష్టపడి చదివితే లక్ష్య సాధన
– ఉచిత ఎంసెట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
– ముస్లిం వెల్పేర్ ఆధ్వర్యంలో ఎంసెట్ తరగతులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు తోడ్పాటు అందించడమే ధ్యేయమని తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు అద్యాపకులు అన్నారు. ముస్లిం వెల్పేర్అ సోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ఉచితంగా ఎంసెట్ కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా సోమవారం మూడో ఏడాది కూడా ఉచిత ఎంసెట్ కోచింగ్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు కమల్ అతహర్, ప్రధాన కార్యదర్శి ఎండీ యూనుస్, విద్యావేత్త పర్యాద రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ పేద విద్యార్థులు వేల రూపాయిలు ఖర్చు చేసుకోకుండా అసోసియేషన్ ద్వారా ఉచితంగ అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించుకోవాలన్నారు. విద్యార్థులు తాండూరుకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలన్నారు. ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇదివరకు నిర్వహించిన శిక్షణ తరగతులలో ప్రతిభను మెరుగు పరుచుకుని ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు.

కావున పేద విద్యార్థులు ఈ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎండీ బాసిత్ అలీ, అబ్దుల్ సలీం, అబ్దుల్ ఖవి, ఖలీల్ఉల్లా షరీఫ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖయ్యూం అతహర్, ఎండీ అజహర్, సభ్యులు ఖయ్యూం పాష, ముస్తాఖ్, అద్యాపకులు తులసీదాస్, ప్రియాంక, అజయ్ కుమార్, వెంకటలక్ష్మీ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

