నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కొరడా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కొరడా..!
– రోడ్లమీదకు వచ్చిన వారికి జరిమానాలు
– తాండూరు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ 
– వాహనదారులకు ఏమని హెచ్చరించారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : నెంబర్లు ప్లేట్లు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలకు తాండూరు పోలీసులు ఝలక్ ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జరిమానాలు విధించారు. శుక్రవారం వికారాబాధ్‌ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద పోలీసుల వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.

సుమారు 50 వాహనాలకు మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అదేవిధంగా వాహనాల యజమాను దారుల చేత పట్టుబడిన వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్లను బిగించేలా చర్యలు తీసుకుని తిరిగి వాహనాలను అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వాహనాలకు నెంబర్‌ ఫ్లేటు లేకుండా రోడ్లపై నడిపితే ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. అదేవిధంగా మైనర్లు డ్రైవ్‌ చేసినా, లైసెన్సు లేకుండా రోడ్లపైకి వాహనాలు వచ్చినా అక్కడికక్కడే పట్టుకుని సీజ్‌ చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎవరికైనా సరే మూడు నెలల జైలు శిక్ష తప్పదని ఎస్‌ఐ హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

పసబిడ్డ ప్రాణానికి సాయం..!