అందరికి స్ఫూర్తిదాయకుడు బాబు జగ్జీవన్ రాం

తాండూరు రాజకీయం వికారాబాద్

అందరికి స్ఫూర్తిదాయకుడు బాబు జగ్జీవన్ రాం
– తాండూరులో ఆయన విగ్రహా ఏర్పాటుకు కృషి
– నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: అణగారిన, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రాం అందరికి ఆదర్శప్రాయుడు అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, దళిత యువజన సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రాం జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా జగ్జీవన్ రాం అందించిన సేవలు గుర్తిండిపోతాయన్నారు. అణగారిన, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. అందరు ఆయన అడుగు జాడల్లో నడిచి ఆశయ సాధనతో ముందుకు సాగాలని అన్నారు. మరోవైపు త్వరలోనే తాండూరులో బాబు జగ్జీవన్ రాం విగ్రహా ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, మున్సిపల్ కౌన్సిలర్‌ మంకాల రాఘవేందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, రాజుగౌడ్, నర్సిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు సారంగా విజయ కుమార్, మార్కెట్ కమిటి డైరెక్టర్ ఆశన్న, ఎస్సీ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు నవీన్, హన్మంతు, డేవిడ్, వెంకటేశం, అనంతి తదితరులు పాల్గొన్నారు.