మహిళ పోలీస్టేషన్ ఏర్పాటుకు చొరవ చూపండి
– జిల్లా ఎస్పీ కోటిరెడ్డికి వినతిపత్రం అందించిన కౌన్సిలర్ సాహు శ్రీలత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మహిళ పోలీస్టేషన్ ఏర్పాటుకు చొరవ చూపించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డిని బీజేపీ మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు, మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత కోరారు. గురువారం తాండూరుకు వచ్చిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తాండూరులో మహిళ పోలీస్టేషన్ లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఎస్సీ దృష్టికి తీసుకువచ్చారు. ఎమైనా సమస్యలు ఉన్నా ఫిర్యాదు చేయాలంటే వికారాబాద్ మహిళ పోలీస్టేషన్కు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. మహిళలకు సౌకర్యవంతంగా ఉండేందుకు తాండూరులోనే మ వాళ పోలీస్టేషన్ ఏర్పాటుకు చొరవ చూపాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా కౌన్సిలింగ్ సెంటర్ను కూడ ఏర్పాటు చేయాలని వి. నతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఇందుకు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, పోలీసులు ఉన్నారు.

