జుంటుపల్లి.. రామమయం..!
– నేత్ర పర్వంగా పెరుగు బసంతం
– శేషవాహనంపై సీతారాముల ఊరేగింపు
– భారీగా తరలివచ్చిన భక్తజనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని జుంటుపల్లి శ్రీరామరాజ్య క్షేత్రంగా మారింది. సీతారాములను భక్తిశ్రద్దలతో దర్శించుకునందుకు భక్తులు పోటెత్తారు. జాతర బ్రహ్మోత్సవాలు సోమవారం రెండో రోజు బ్రహ్మాండంగా జరిగాయి. శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా దేవాలయంలో పెరుగు బసంతం జరిగింది.

దేవాలయ చైర్మన్ శ్యాంసుందర్ రావు, మేనేజర్ రాంజేందర్ రెడ్డి, సభ్యుల ఆధ్వర్యంలో శేష వాహనంపై సీతారాముల ఊరేగింపుతో పాటు బసంతోత్సవం వైభవంగా నిర్వహించరు. బసంతోత్సవంలో పెరుగు కుండలో పెరుగుతో పాటు చిన్న చిన్న ముక్కలు వేస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు వరదరాజ్ జోషి భక్తులపై వేయగా వాటిని దక్కించుకునె ందుకు పోటీపడ్డారు. ఇవి దక్కించుకుని ఇంట్లో దాచుకుంటే సిరి సంపదలు, అదృష్టం, భోగ భాగ్యాలకు కొదువ ఉండదని భక్తుల విశ్వాసం. పెరుగు బసంతం నేత్రపర్వంగా కొనసాగింది. అదేవిధంగా జాతర ఉత్సవాలలో భాగంగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి శేషవాహనంపై ఊరేగింపు చేశారు.

ఈ ఊరేగింపుతో జుంటుపల్లిలో అత్యంత శా భాయామానం సంతరించుకుంది. శ్రీరామచంద్ర మూర్తిలను స్మరిస్తూ భక్తులు ముందుకు సాగారు. చక్రస్నానం తరువాత సీతారాముల విగ్రహాలను తిరిగి దేవాలయానికి చేర్చారు. మరోవైపు ఆదివారం రాత్రి రథోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా నిర్వహించారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తాండూరు రూరల్ సీఐ నగేష్ ఆధ్వర్యంలో యాలాల ఎస్ఐ గిరన్న నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జాతర ఉత్సవాలు ప్రశాంతంగా.. విజయవంతంగా జరగడం పట్ల ఆలయ చైర్మన్, సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదికూడా చదవండి….

