వంటింట్లో గ్యాస్ మంట..!
– సిలిండర్ ధరలు పెంచిన కేంద్రం
– ఉజ్వల పథకానికి కూడా వర్తింపు
దర్శిని డెస్క్ : దేశంలో వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడిపై మరోసారి భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. సిలిండర్‌పై రూ.50 పెంచినట్లు కేంద్ర చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఇప్పటికే నిత్య అవసరం ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్యుడి ఇది షాకింగ్ న్యూస్. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్దిదారులకు కూడా ధరలు పెరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. పెంచిన ఈ ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.

గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్(LPG cylinder)పై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువుల శాఖమంత్రి హర్దీప్‌సింగ్ పురీ వెల్లడించారు. ఈ ధరల పెంపు ఉజ్వల పథకం లబ్ధిదారులకు సైతం వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 500 నుంచి రూ. 550కు పెరిగింది. ఈ ధర ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తిస్తుంది. ఇతరులు రూ. 853 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు వినియోగదారులపై భారం మోపడం లేదని కూడా స్పష్టం చేశారు. ఈ భారాన్ని చమురు మార్కెటింగ్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇదికూడా చదవండి….

