గొప్ప సంఘ సంస్క‌ర్త‌ మహాత్మా సావిత్రిబాయి పూలే

తాండూరు వికారాబాద్

గొప్ప సంఘ సంస్క‌ర్త‌ మహాత్మా సావిత్రిబాయి పూలే
– బీసీ సంఘం తాండూరు కన్వీనర్ రాజకుమార్ కందుకూరి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: స‌మాజం కోసం ఎంతో కృషి చేసిన గొప్ప సంస్క‌ర్త మ‌హాత్మ సావిత్రి బాయి పూలే అని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. గురువారం తాండూరు ప‌ట్ట‌ణంలో సావిత్రిబాయి ఫూలే 125 వర్ధంతిని ప్ర‌జా సంఘాల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సావిత్రి బాయి చిత్ర పటానికి ప‌లువురు నివాళులు అర్పించారు. అనంత‌రం కందుకూరి రాజకుమార్ మాట్లాడుతూ దళిత బడుగు బలహీన వర్గాల మహిళలకి చదువు నేర్పించి, అంటరాని తనం కోసం, అశృషత కోసం మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలు అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చదువు చెప్పి ఒక దిక్సూచి లాగా విద్య నేర్పిన సావిత్రిబాయి పూలే ఎంతో గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. మహిళలు కూడా సమానం అని వారికి విద్యను బోధించి సమాజంలో వారిని చైతన్య పరిచారు అలాంటి గొప్ప మహానుభావురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. వారి ఆశలను నేటి యువత, సమాజం కుల మతాల బేధాలు లేకుండా సమాజం అంతా ఒకటే అనే భావనతో పని చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసి రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, కేవీపీఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు బుగ్గప్ప, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రప్ప, బీసి జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, జన చైతన్య యువజన సంఘం నాయకులు జె వెంకటేష్, శివ, బీసి పట్టణ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జి బస్సు, బీసి నాయకులు తాండ్ర నరేష్, మతిన్, శశి, అంబదాస్ తదితరులు పాల్గొన్నారు.