వేసవిలో ఉల్లి ఉపయోగాలు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

వేసవిలో ఉల్లి ఉపయోగాలు..!
– వడదెబ్బకు దివ్యౌషధం
– సమ్మర్ వ్యాధుల నుంచి రక్షణ
దర్శిని డెస్క్ : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత అనే సామేత అందరికి తెలిసిందే. ప్రస్తుత వేసవిలో ఉల్లి నుంచి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వేసవిలో వచ్చే రోగాల నుంచి రక్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఇందులోని సెలీనియం అనే మూలకం రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో సమ్మర్‌లో తరచూ వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో సహజంగా గురయ్యే వడదెబ్బకు పచ్చి ఉల్లిపాయ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. అధిక ఉష్ణోగ్రత నుంచి రక్షించుకోవడానికి ఉల్లిపాయలు ఎంతగానో ఉపయోగపడతాయిని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చి ఉల్లిపాయ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. సల్ఫర్, క్వెర్సెటిన్ వంటి యాంటీ-డయాబెటిక్ సమ్మేళనాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. వేసవిలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇక పచ్చి ఉల్లిపాయ, నిమ్మరసం కలిపిన సలాడ్ తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి, పొట్ట సమస్యలు దరిచేరవు.

ఇదికూడా చదవండి….

అంబేద్కర్‌పై ఎస్ఐ అభిమానం..!