తేనే, జీడిపప్పుతో లాభాలు..!
– నానబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి బలం
– గుండె, కీళ్ల సమస్యలకు చక్కని పరిష్కారం
దర్శిని డెస్క్ : తేనె గురించి.. జీడి పప్పు గురించి అందరికి తెలిసిందే. ఈ రెండింటిని తీసుకోవడంలో ఇష్టపడని వాళ్లు ఎవ్వరు ఉండరు. ఇప్పటికే చాలా మంది వీటిని వేరు వేరుగా తీసుకుని ఉంటారు. అయితే తేనేలో జీడిపప్పును నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నరు. అయితే తేనెలో నానబెట్టిన జీడిపప్పు మితంగా తింటేనే అది అమృతంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో అధిక కేలరీలు ఉంటాయి. రుచిగా ఉందికదాని అపరిమితంగా తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి రోజుకు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు.

తేనెలో జీడిపప్పు నానబెట్టి తీసుకోవడం వల్ల వీటిలోని కాల్షియం, సోడియం, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా శరీరానికి అందుతాయి. ఇక తేనె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బరువు తగ్గడం నుంచి డిప్రెషన్ ఆపడం వరకు ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రకృతి ప్రసాధించిన సహజ తేనెలో జీడిపప్పు నానబెట్టి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది.అలాగే కంటి సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మంచి ఎంపిక. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది.
నోట్ : ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇదికూడా చదవండి…

