తాండూరు నిరుద్యోగులకు శుభవార్త..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు నిరుద్యోగులకు శుభవార్త..!
– రేపు తాండూరులో మెగా జాబ్ మేళా
– జీవైఎఫ్, బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు
– సద్వినియోగం చేసుకోవాలని కందుకూరి రాజ్ కుమార్ పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్లోబల్ యువతరం ఫౌండేషన్(జీవైఎఫ్), బీసీ సంఘం సంయక్త ఆధ్వర్యంలో రేపు తాండూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, జీవైఎఫ్ వ్యవస్థాపకులు విజయేందర్, అరుణ్ రాజులు తెలిపారు.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం తాండూరు సింధూ జూనియర్ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుందని చెప్పారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీతో పాటు ఎంఎల్టీ, డీఎంఎల్టీ, ఎంపీహెచ్ డబ్ల్యూఎఫ్, డిప్లొమా, పాలిటెక్నిక్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదివిన అర్హత కలిగిన వారికి ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. తాండూరులోని నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్: 9652100231, 8465970580లకు సంప్రదించాలని సూచించారు.

ఇదికూడా చదవండి….

ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం