ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం
– పూజలు నిర్వహించిన కుటుంభీకులు
– తాండూరు పట్టణంలో అద్బుతం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంట్లో పవిత్రమైన బ్రహ్మ కమలం విరబూయడం ఎంతో శుభకరం. తాండూరు పట్టణం శాంతినగర్‌లో నివాసం ఉంటున్న పెద్దేముల్ మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన రాజారెడ్డి కుటుంబ సభ్యులకు ఆ భాగ్యం కలిగింది. రాత్రి వారి నివాసంలో బ్రహ్మకమలం విరబూసింది. శివునికి ఇష్టమైన బ్రహ్మకమలం వికసించడంతో కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.

తమ నివాసంలో బ్రహ్మకమలం వికసించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇంటి పరిసర ప్రజలు ఈ అద్భుతానికి తన్మయంతో దర్శనం చేసుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ బ్రహ్మ కమలాలు హిమాలయాల్లోనే వికసిస్తాయని పండితులు చెబుతారు. రాత్రిళ్లు మాత్రమే విరబూస్తాయని అంటుంటారు. సాధారణంగా జులై నుంచి సెప్టెంబర్ మాసాల్లో మాత్రమే ఇవి వికస్తాయని చెబుతారు. తాండూరులో ముందుగానే బ్రహ్మకమలాలు విరబూయడం అద్బుత ఘట్టంగా నిలిచింది.

ఇదికూడా చదవండి….

ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలి