సార్లూ స్పందించారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సార్లూ స్పందించారు..!
– రోడ్డుపై పడ్డ చెట్టు తొలగింపు
– హర్షం వ్యక్తం చేసిన స్థానికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డుపై పడిన చెట్టును తొలగించండి సారూ అంటూ దర్శిని న్యూస్‌లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. నడి రోడ్డుపై పడిన చెట్టును సిబ్బంది చేత తొలగించారు. గురువారం సాయంత్రం జోరుగా ఈదురు గాలులు వీచాయి. ఈ భీభత్సానికి తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ఓ చెట్టు రోడ్డుపై నేలకొరిగింది.

నడిరోడ్డుపై చెట్టు పడి 24 గంటలలు గడిచినా ఎలాంటి తొలగింపు చర్యలు తీసుకోలేదు. శుక్రవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులతో పాటు స్థానికులు కూడా రోడ్డు దాటేందుకు అవస్థలు పడ్డారు. రోడ్డుపై చెట్టు పడినా కూడా మున్సిపల్ అధికారులు కాని, ఏరియా జవాన్ గాని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దర్శిని న్యూస్‌లో కథనం వచ్చింది. గంటల్లోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించారు. రోడ్డుపై పడిన చెట్టును తొలగించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి….

ఈ చెట్టు తీయండి.. సారూ…!