తాండూరు నిరుద్యోగ యువత అభ్యున్నతే ధ్యేయం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు నిరుద్యోగ యువత అభ్యున్నతే ధ్యేయం
– జాబ్ మెళాలతో ఉద్యోగవకాశాలు కల్పించడమే లక్ష్యం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
– జీవైఎఫ్, బీసీ సంఘం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
– 300లకు పైగా అభ్యర్థుల హాజరు, 86 మందికి నియామకాలు
– మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలోని నిరుద్యోగ యువత అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేయడం జరుగుతుందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

శుక్రవారం సాంఘీక సంస్కర్త, విద్యా ప్రదావి మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని గ్లోబల్ యువతరం(జీవైఎఫ్‌), బీసీ సంఘం సంయక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. పట్టణంలోని సింధూ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు 300లకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయేందర్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాబ్ మేళాలో ఎంఎన్సీ(మల్టీ నేషనల్ కంపెనీ)లు మహింద్రా, ఎబుక్కాప్, అపోలో ఫార్మసీ, శ్రీరామ్ చిట్స్, విజయ డయాగ్నోస్టిక్, మెడిపస్, ముత్తూట్ ఫైనాన్స్, మార్వెల్ బయోకెం, ఫెడరల్ బ్యాంక్ ఇండియా తదితర కంపెనీలకు చెందిన హెస్ఆర్ లు, కోఆర్డినేటర్లు ద్వారా నిరుద్యోగులకు ఇంటర్వూలు నిర్వహించారు. వచ్చిన 300లకు పైగా అభ్యర్థులలో 86 మందికి పైగా వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా కందుకూరి రాజ్ కుమార్ తో పాటు పలువురు మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలోని నిరుద్యోగుల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి స్థానిక యువతీ యువకులకు ఉద్యోగాలు దక్కేలా చొరవచూపుతామన్నారు. అదేవిధంగా మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా అందరు ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవైఎఫ్ వ్యవస్థాపకులు మంబాపూర్ విజయేందర్, కార్యదర్శి అరుణ్ రాజ్, అంబేద్కర్ కాలేజీ వ్యవస్థాపకులు రంగారావు, వ్యాపార వేత్త నితిన్ సోమాని, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, చీఫ్ రిక్రూట్ మెంట్ ఆఫీసర్ వై.రమేష్, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, బీసీ సంఘం మహిళ అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు మంజుల, కార్యదర్శులు లక్ష్మి, నర్సమ్మ, విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పెద్దేములు. తాండూరు, యాలాల అధ్యక్షులు శ్రావణ్ కుమార్, బంసత్ కుమార్. లక్ష్మణ్ చారి, బషీరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీశ్వర్, యూత్ ప్రెసిడెంట్ సిద్ధార్థ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజు, యువనాయకులు గౌతమ్ రాజ్, గిరిజాపురం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

భళా.. బాలిక..!