కీవీ.. ఆరోగ్య గని..!

ఆరోగ్యం జాతీయం తాండూరు తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

కీవీ.. ఆరోగ్య గని..!
– ఇందులోని పోషకాలతో ఎంతో మేలు
– పేగు క్యాన్సర్‌పై బ్రహ్మాస్త్రం
దర్శిని డెస్క్ : పండు పండులో ఆరోగ్యం దాగి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. మన దేశంలోని లభించే పండ్లతో పాటు విదేశీ పండ్లలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి పండ్లలో కీవీ పండ్లు ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి. కివీ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. కివీ పండులోని విటమిన్ సి, ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సిడేటివ్ నష్టం నుంచి రక్షించి యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఈ పండులో అనేక పోషకాలు నిండి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండే కివీ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని ప్రోటీన్ల జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్ కివీలో ఉంటుంది. ఇది దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. కివీ పండులోని ఫైబర్, ఫైటోకెమికల్స్ కడుపు, పెద్దపేగుల్లో క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాదు..కివీ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.

కివీ పండులోని విటమిన్ సి, ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సిడేటివ్ నష్టం నుంచి రక్షించి యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. కివీ పండులో ల్యూటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి వయసు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుంచి రక్షించి, దృష్టిని మెరుగుపరుస్తాయి. కివీ పండులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కివీ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కివీ పండులోని విటమిన్ కె ఎముకలను ఆరోగ్యంగా ఉంచి, ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకో కివీ పండు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై అస్సలు వదిలిపెట్టారు.

ఇది కూడా చదవండి….

కరణం పురుషోత్తంరావుకు ఉగాది నంది పురస్కారం