రమేషన్నకు ఘన సత్కారం

తాండూరు రాజకీయం వికారాబాద్

రమేషన్నకు ఘన సత్కారం
– సన్మానించిన పినపాక బీజేపీ నేతలు
– ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్‌కు ఘన సత్కారం దక్కింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గా యు.రమేష్ కుమార్ పినపాక నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అక్కడి నాయకులను సమన్వయ పరుస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి గెలుపుకోసం విశేషంగా కృషి చేశారు. ఇందుకు గాను పినపాక నియోజకవర్గ పార్టీ నాయకులు యు.రమేష్ కుమార్ ను ఆదివారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ ముసుకు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతారామరాజు, అసెంబ్లీ కన్వీనర్ బిక్షపతిలు మాట్లాడుతూ రమేష్ కుమార్ పనితీరును ప్రశంసిస్తూ అభినందించారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా సన్మానం పొందిన యు.రమేష్ కుమార్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సేవలను వినియోగించుకున్నందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆదేశించిన ఏ కార్యక్రమాన్ని అయినా చిత్తశుద్దితో పూర్తి చేయాలని అప్పుడే విజయాలు వరిస్తాయని అన్నారు.

ఇదికూడా చదవండి…

రేపు సాయిబాబ మందిర వార్షికోత్సవం