పేదల ఆరోగ్యానికి భరోసా

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేదల ఆరోగ్యానికి భరోసా
– సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన నేతలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) పథకం పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తుందని తాండూరు పట్టణ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్ అన్నారు. తాండూరు మున్సిపల్ పరిధి రాజీవ్ కాలనీకి చెందిన నారాయణ చారీ భార్య లక్ష్మీ ఇటీవల అనారోగ్యానికి గురైంది. వైద్యం కోసం చేవె ళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలను ఆశ్రయించారు. ఎంపీ రంజిత్ రెడ్డి సహాకారంతో బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 60 వేల చెక్కు మంజూరు అయ్యింది. గురువారం తాండూరు ప‌ట్ట‌ణంలో టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్ టీఆర్ఎస్ నాయకులు మసూద్ తో కలిసి లబ్దిదారు కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదల ఆరోగ్యానికి భరోసా నిలుస్తుందని, ఈ పథకాన్ని వైద్యం చేయించుకులేని పేదలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.