బీఎంఆర్ మెగా జాబ్ మేళాకు సిద్దం..!

తెలంగాణ రాజకీయం వికారాబాద్

బీఎంఆర్ మెగా జాబ్ మేళాకు సిద్దం..!
– వినాయక కన్వేన్షన్ హాల్‌లో భారీ ఏర్పాట్లు
– పరిశీలించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో బీఎంఆర్ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి వినాయక కన్వెన్షన్ హాల్ ను సందర్శించారు.

మెగా జాబ్ మేళా కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. జాబ్ మేళాలో పాల్గొన్న దాదాపు 50 కంపెనీల కోసం కౌంటర్లు ఏర్పాటు చేయించారు. తాండూరు నియోజకవర్గంలో ని నిరుద్యోగ యువతకు 10వేల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జాబ్ మేళాను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, స్వచ్చంద సంఘాల నాయకులు, అధికారులు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, బంటు వేణుగోపాల్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

శభాష్.. క్రాంతి కుమార్..!