నమోః లక్ష్మీ నర్సింహా స్వామి..!
– యాద్రాది దైవ దర్శనంలో బంటు మల్లప్ప
– సన్నిహితులతో కలిసి దర్శనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నమోః నర్సింహా స్వామి అంటూ తాండూరుకు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప యాదాద్రి వెలిసన స్వామి వారిని వేడుకున్నారు. ఆదివారం ఆయన తన జన్మదినం సందర్భంగా కుమారుడు, బందువులతో కలిసి యాదాద్రి లక్ష్మీ నర్సింహా స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో వెలసిన లక్ష్మీ నర్సింహా స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామిని దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అందరు భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మిక చింతనతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. రైతుల కోసం మంచి వర్షాలు కురిసి, పంటలు భాగా పండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.

ఇదికూడా చదవండి…

