అభివృద్ధి కోసమే ఆక్రమణల తొలగింపు
– నిర్మాణాల తీసివేతతో చిక్కులు దూరం
– అందరు స్వచ్ఛందంగా సహకరించాలి
– మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధి కోసమే ఆక్రమణ తొలగింపు చేపట్టడం అభినందనీయమని కాంగ్రెస్ సీనీయర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబేర్ లాల అన్నారు. గత రెండు రోజులుగా మున్సిపల్ అధికారులు, పోలీసులతో కలిసి ప్రధాన రోడ్లపై చేస్తోన్న ఆక్రమణ తొలగింపు చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా రోడ్లపై నిర్మాణాలు, వ్యాపారాలు చేపట్టడంతో ఇబ్బందులు ఎదరవుతున్నాయని అన్నారు.

మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ సహాకారంతో ఆక్రమణల తొలగింపు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇందుకు పట్టణ వ్యాపారులు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు అందరు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. రోడ్లపై ఆక్రమణల తొలగింపు వల్ల ప్రధాన రోడ్ల విస్తరణ జరుగుతుందని, ప్రస్తుత వర్షాకాలంలో ట్రాపిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు. పట్టణ అభివృద్ధి కోసం అందరు మద్దతు తెలపాలని అన్నారు. కొందరు నేతలు, వ్యాపారులు చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దన్నారు. ఎవరికైనా నష్టం జరుగుతున్నట్లు అయితే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంలో పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు. వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని చిలుక వాగు పనులు వేగంగా జరిగేలా దృష్టిసారించారని అన్నారు. గొల్ల చెరువు అభివృద్ధికి చొరవ చూపుతున్నారని, ప్రతి వార్డులో తాగునీరు, మురుగు కాలువలు, మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని అన్నారు.

ఇదికూడా చదవండి…

