వాము ఆకుల్లో అద్భుతాలు..!
– దీని టీ తాగితే పొట్ట సమస్యలు పరార్
– గ్యాస్ట్రిక్ సమస్యపై ఎలా పనిచేస్తుందంటే..?
దర్శిని డెస్క్: వంటింట్లో ఉపయోగించే వాము మన ఆరోగ్యానికి అద్భుతంలా పనిచేస్తుందని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు. అందుకనే మన అనేక దేశీ పానీయాలు, కూరలు, పరాటాల వంటి రొట్టెల తయారీలో కూడా రుచి కోసం జోడిస్తారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. అయితే దీని ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల శరీరంలో అద్భుతాలు జరుగుతాయని, పొట్ట సమస్యలన్నీ పరార్ అవుతాయని చెబుతుంటారు. ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

వాము ఆకులలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కాపర్, కాల్షియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి విటమిన్లు ఉంటాయి. అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆస్తమాతో బాధపడుతున్న వారు ఈ వాము ఆకును వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వాము ఆకులతో తయారుచేసిన టీ ని ప్రతిరోజు తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాము ఆకులతో తయారుచేసిన టీ తాగడం వల్ల సులభంగా గ్యాస్టిక్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. వాము ఆకులతో చేసిన టీ ఉదయాన్నే తాగితే ఖాళీ కడుపుతో తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. వాము ఆకుల టీని సులభంగా తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం, కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వాము ఆకుల టీ తయారీ కోసం ముందుగా వాము ఆకులను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. వాము ఆకులను శుభ్రం చేసుకున్న తర్వాత నీటిని మరిగించుకొని అందులో వేయండి. వేసిన తర్వాత మూడు నిమిషాలు మరిగించి గాజు గ్లాసులో వడకట్టుకోండి. గాజు గ్లాస్‌లో వడకట్టుకున్న తర్వాత తగినంత తేనె వేసుకుని గాలి కడుపుతో తాగితే గ్యాస్టిక్ సమస్య సులభంగా మాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆకులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మంచి నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా వాము ఆకులను ఉపయోగించవచ్చు.

ఇదికూడా చదవండి…

