సొంత వ్యాపారానికి బెస్ట్ స్కీం..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం హైదరాబాద్

సొంత వ్యాపారానికి బెస్ట్ స్కీం..!
– ఎలాంటి షురూటీ లేకుండా రుణాలు
– 50వేల నుంచి 20లక్షల దాకా పొందే అవకాశం
– అర్హతలు, దరఖాస్తుల నిబంధనలు తెలసుకోండి..
దర్శిని డెస్క్ : సొంత వ్యాపారం చేయాలను నిధులు లేక సతమతం అవుతున్న సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం బెస్ట్ స్కీంను అమలు చేస్తోంది. అసక్తి ఉన్న వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పదేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. గతంలో రూ.10 లక్షల వరకు రుణం ఇవ్వనుండగా, ప్రస్తుతం దీనిని రూ.20 లక్షల వరకు పెంచుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నది. దీంతో నిధులు లేక సతమతమవుతున్న చిన్న, మధ్య స్థాయి సంస్థలకు భారీ ఊరట లభిస్తోంది. చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు(Small scale industries) ఏర్పాటు చేయాల‌నుకునే ఔత్సాహితులకు ఈ పథకం పథకం ద్వారా మోడీ ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఎలాంటి షూరిటీ లేకుండానే రూ. 50వేల నుంచి 10 లక్షలు దానికి మించి 20 లక్షల రూపాయల లోన్(Loan) పొందొచ్చు.

ముద్ర లోన్‌లో ఎన్ని రకాలు అంటే
ముద్ర లోన్ లో మూడు రకాల రుణాలు ఉంటాయి. ఒకటి… రూ. 50 వేల వరకు లోన్ పొందేది శిశు రుణాలు.
రెండు. కిశోర రుణాల కింద 50 వేల రూపాయల నుంచి రూ. 5 లక్షల వరకు
తరుణ్ లోన్ కింద 5 లక్షల రూపాయల నుంచి రూ. 10 లక్షల వరకు తీసుకోవచ్చు.
తరుణ్ ప్లస్ లోన్ కింద రూ. 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంది.
ఈ లోన్ ఒకేసారి తిరిగి చెల్లిస్తే.. మరోసారి రుణం తీసుకున్నప్పుడు ఒకేసారి రూ. 10 నుంచి 20 లక్షల రూపాయల లోన్ ఇవ్వాలని ఓ కండిషన్ కూడా ఉంది.

రుణాల కోసం అర్హతలు
రుణాలు పొందేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇందులో వ్యక్తులు, ఏదైన వ్యాపారం ఉంటే దాని యజమాన్య సంస్థ, భాగస్వామ్య సంస్థ, ప్రైవేటు లిమిటేడ్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, చట్టపరమైన సంస్థలకు రుణాలు అందిస్తారు. PMMY కింద ముద్రా రుణాలు రూ.10 లక్షల కంటే తక్కువ రుణ అవసరాలు కలిగిన, వ్యవసాయేతర ఆదాయాన్ని ఉత్పత్తి చేసే వ్యాపారాలు, తయారీ సంస్థలకు అందుబాటులో ఉన్నాయి. పర్యాటక రంగంలో ఉపాధి ఆధారిత వృద్ధిని సులభతరం చేయడానికి హోమ్‌స్టేలకు కూడా ముద్రా రుణాలు అందించబడతాయి. తరుణ్ కేటగిరీ కింద గతంలో రుణాలు పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన సంస్థలు తరుణ్‌ప్లస్ కింద రూ.20 లక్షల వరకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
PSB లోన్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. ‘లాగిన్’ పై క్లిక్ చేసి, ‘రిజిస్టర్’ ఎంపికపై క్లిక్ చేయండి. అవసరమైన వివరాలను నమోదు చేసి పోర్టల్‌లో నమోదు చేసుకోండి. ‘ముద్రా లోన్’ ఎంపికను ఎంచుకుని, ‘ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి’ పై క్లిక్ చేయండి. దరఖాస్తును పూరించండి, పత్రాలను అప్‌లోడ్ చేసి సమర్పించండి. దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత, రుణ మొత్తాన్ని చెల్లించడానికి బ్యాంకుకు సమర్పించండి.

బ్యాంకులు అందించే వడ్డీ రుణాలు వివరాలు

ఇదికూడా చదవండి…

ఐపీఎల్‌ చాలెంజ్ పిచ్చి.. పీక్స్..!