బులేరో బండి భీభత్సం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బులేరో బండి భీభత్సం..!
– వెంట వెంటనే రెండు బైకులకు ఢీ
– బైకును అలాగే నెట్టుకొచ్చిన డ్రైవర్
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వేగంగా వస్తున్న ఓ బులేరో బండి రెండు బైకులను ఢీ కొట్టి భీభత్సం సృష్టించింది. మొదటి బైకును ఢీకొట్టిన వెంటనే మరో బైకును ఢీకొట్టింది. రెండోసారి ఢీ కొట్టిన బైకును అలాగే కిలో మీటరు వరకు నెట్టుకుంటూ దూసుకవచ్చింది. ఈ భయానక సంఘటన బుధవారం రాత్రి తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు కోడంగల్ వైపు నుంచి తాండూరు వస్తున్న బులేరో ఫ్లైఓవర్ సమీపంలో ఓ బైకును ఢీ కొట్టింది. ఈ బైకుపై ఉన్న వ్యక్తిగా గాయాలయ్యాయి. అలాగే వేగంగా వచ్చిన బులె రో డ్రైవర్ తాండూరు నుంచి అగ్గనూరు వెళుతున్న పోస్టుమ్యాన్ మహమ్మద్ మౌలానాను ఢీకొట్టేందుకు వెళ్లాడు. అప్రమత్తమైన మౌలానా బైకును వదిలేసి పక్కకు దూకేశాడు.

వేగంలో ఉన్న బులేరో బైకును అలాగే లాక్కుని రోడ్డుపై భీభత్సం సృష్టించుకుంటూ దూసుకెళ్లాడు. సుమారు ఓ కిలో మీటర్ తరువాత పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానికులు బులేరోను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ ను పోలీస్టేషన్ కు తరలించారు. ఈ భీభత్స దృశ్యాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వ్యక్తి వివరాలు తెలియరాలేదు.

ఇదికూడా చదవండి…

సైన్స్ టీచర్ సస్పెండ్..!