కల్తీ దందాకు కళ్లెం..!
– హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు
– దర్బార్ టీ స్టాల్ ను సీజ్ చేసిన అధికారులు
– ఇతర దుకాణాలు, హోటళ్లలో కూడా తనిఖీలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సంపాదనే ధ్యేయంగా కల్తీ ఆహారాలతో చేస్తున్న దందాపై తాండూరు మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. సీజనల్ వ్యాదుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గురువారం తాండూరు మున్సిపల్ శానిటరీ ఇను స్పెక్టర్ ఉమేష్ కుమార్ జవాన్లు, సిబ్బందితో కలిసి హోటళ్లు, దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్ రోడ్డు మార్గంలోని దర్బార్ టీ స్టాల్ లో తనిఖీలు చేపట్టగా అందులో ఫాస్ట్ ఫ్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఫాస్ట్ఫుడ్ సెంటర్ లో కల్తీ నూనెతో తినుబండాలను తయారు చేస్తున్నట్లు గుట్టు రట్టు చేశారు. తనిఖీలో కల్తీ నూనెను స్వాదీనం చేసుకుని పారబోశారు. అదేవిధంగా పట్టణంలోని సోహైల్ హోటల్, ఆల్ ఫూర్ ఖాన్ హోటల్ తదితర వాటిపై దాడులు చేశారు. కల్తీ నూనెతో తయారు చేస్తున్న తినుబండారాలను, వస్తువులను గుర్తించి స్వాదీనం చేసుకున్నారు.

మరోవైపు పట్టణంలోని దుర్గా రెస్టారంట్ ఎదురుగా ఉన్న స్క్రాఫ్ దుకాణంలో ఎలాంటి లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తున్నారని గుర్తించారు. వెంటనే దానికి తాళం వేసి సీజ్ చేశారు. అధికారుల దాడులు, తనిఖీలతో వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన తినుబండరాలు, వస్తువులు అందించాలని సూచించారు. కల్తీ దందాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

