రేపు దొడ్డి కొమురయ్య వర్ధంతి

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు దొడ్డి కొమురయ్య వర్ధంతి
– తరలి రావాలని సంఘం నేతల పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని రేపు జరుపుకోవడం జరుగుతుందని తాండూరు నియోజకవర్గ కురుమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 10-30 గంటలకు తాండూరు పట్టణం యశోధ నగర్‌ పార్కులో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వర్దంతి సందర్భంగా పార్కులోని దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. కావున నియోజకవర్గంలోని కురుమ సంఘం పెద్దలు, సంఘం నాయకులు, యువకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

నల్ల మిరియాలతో అద్భుత ప్రయోజనాలు..!