సీఎం కేసీఆర్‌ కృషితో పాలమూరు

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం కేసీఆర్‌ కృషితో పాలమూరు
– ఎత్తిపోతలకు అనుమతులు హర్షణీయం
– తాండూరుకు సాగునీరందడం ఖాయం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సర్కారు పోరాటంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతలకు అనుమతులు సాధించుకున్నామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం పట్ల శుక్రవారం తాండూరులో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధనకు తెలంగాణ సర్కారు ఎన్నో ఒడిదుడుకులను ఎదర్కొందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడి అనుమతులు సాధించకోవడంలో తెలంగాణ వాసుల, దీక్ష, సంకల్పాలు దాగి ఉన్నాయన్నారు. రెండో దశ పనులు కూడా పూర్తయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తాండూరు నియోజకవర్గంలో 1 లక్ష 30 వేల ఎకరాలకు కృష్ణా జలాలు అందుతాయన్నారు. ఈ పథకంలో భాగంగా పెద్దేముల్ మండలం తట్టిపల్లి వద్ద 1 టీఎంసీ రిజార్వాయుర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలోనే తాండూరుకు కృష్ణా జలాలతో సాగునీరండం ఖాయమన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు పొందడం రైతుల విజయమని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మున్సిపల్ వైస్ వైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!