పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

తాండూరు రాజకీయం వికారాబాద్

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
– ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి
– జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎ. శంకర్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, విద్యార్థులు.. యువత ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వికారాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(నోడల్ ఆఫీసర్) ఎన్. శంకర్ నాయక్ అన్నారు.

మంగళవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో మేర యువ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు చెట్లు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు.

ఇందులో విజేతలకు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్, జిల్లా యూత్ అధికారి అయిజయ్య చేతుల మీదుగా మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఏక్ పేడ్ మా కే నామ్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. నాటిన చెట్టును సరంక్షించి భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు వెంకటస్వామి. డా. విద్యాసాగర్, వెంకన్న, వెంకటస్వామి, గోవర్దన్, రమా తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సాయిపూర్‌లో అభివృద్ధి జోరు..!