గురుకులాల్లో మెరిసిన బాలికలు..!
– తాండూరు డివిజన్ టాపర్లుగా రికార్డు
– అభినందించిన ఉపాధ్యాయులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని గురుకులాల్లో బాలికలు మెరిశారు. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి తాండూరు డివిజన్ టాపర్లుగా నిలిచారు.

తాండూరులోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఏ. సాత్విక-561/600, ఎల్. ప్రనిధి రెడ్డి – 558/600, ఎం. శివరంజనీ -558/600, ఎస్. అమూల్య – 558/600, ఎల్. గీత – 555/600, కె. జ్యోతిబాయి – 549/600 మార్కులతో సత్తా చాటారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్లు విద్యార్థులను అభినందించారు.

ఇది కూడా చదవండి….

